పురుగుమందు తాగి వృద్ధుడి ఆత్మహత్య
NEWS Jan 20,2025 05:13 pm
ఇబ్రహీంపట్నం మండలం గోదురుకు చెందిన రెబ్బసి ఆశన్న (72) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. ఇటీవల అతని భార్య మృతితో మనస్తాపానికి గురయ్యాడు. మృతుడి కుమారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.