Logo
Download our app
ముగ్గురు అంతర్‌జిల్లా దొంగల అరెస్టు
NEWS   Jan 20,2025 07:07 am
కామారెడ్డి జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ చైతన్యారెడ్డి తెలిపారు.10న పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీలో ఉన్న 5ఆలయాల్లో జరిగిన చోరీపై ఆలయ చైర్మన్‌ కృష్ణయాదవ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు. హౌసింగ్‌ బోర్డు కాలనీలో ముగ్గురు అనుమానితులను పోలీసులు పట్టుకొని విచారించారని చెప్పారు. విచారణలో కామారెడ్డి పోలీసు స్టేషన్‌ పరిధిలో 5, దేవునిపల్లి పరిధిలో 3, భిక్కనూర్‌, రామారెడ్డి, ఎడపల్లి పోలీసుస్టేషన్లలో 11 కేసులున్నట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source