ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ స్టార్ట్
NEWS Jan 19,2025 08:43 pm
తిరుపతిలో ఏర్పాటు చేసిన రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ భవనాలను కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా వర్చువల్ గా ప్రారంభించారు. నేర పరిశోధనకు సంబంధించి కీలకమైన ఆధారాలను కనుగొనేందుకు ఇది దోహద పడుతుందన్నారు. డీఎన్ఏ విభాగం ఫోక్సో కేసులు, ఇతర గంభీరమైన కేసులకు సంబంధించిన డీఎన్ఏ శాంపిళ్లను ఇక్కడనే టెస్ట్ చేయడం జరుగుతుందన్నారు. ఒకప్పుడు విజయవాడకు పంపాల్సిన అవసరం ఉండేదన్నారు.