కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం
NEWS Jan 19,2025 07:23 pm
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్పా చేసింది ఏమీ లేదన్నారు. చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, జనం సమస్యలను గాలికి వదిలి వేశాడంటూ మండిపడ్డారు. ఏం ఉద్దరించారని దావోస్ పర్యటనకు వెళ్లారో చెప్పాలన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు.