Logo
Download our app
ఒక్క రోజు అలా చేస్తే మానసిక ప్రశాంతత
NEWS   Jan 19,2025 04:11 pm
ఆస్తులు, డబ్బు, అధికారంతో దొరకని మానసిక ప్రశాంతత ఒక్క రోజు అలా చేస్తే లభిస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన స్మృతి దినం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నిత్యం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జనం మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారని అన్నారు. అటువంటివారు వారంలో ఒక్క రోజైనా ఆధ్యాత్మికతపై దృష్టి సారిస్తే ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source