అదుపుతప్పి బోర్ వెల్ లారీ బోల్తా
NEWS Jan 19,2025 05:13 pm
కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిలోని కొండగట్టు దొంగలమర్రి ప్రాంతంలో బోర్ వెల్ లారీ బోల్తా పడిన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొడిమ్యాలకు చెందిన శ్రీ లక్ష్మీ సాయి బోర్ వెల్ లారీ జగిత్యాల ప్రాంతంలో బోరు వేయడానికి వెళుతున్న సమయంలో జాయింట్ రాడ్ విరిగి చెట్టుకు ఢీ కొని ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడగా 108లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.