పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం
NEWS Jan 19,2025 05:40 am
నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పసుపు బోర్డు ప్రకటన బీజేపీ కార్యక్రమంలా ఉంది. పార్లమెంట్ సభ్యురాలిగా తాను ఐదేళ్లు లోక్ సభలో పసుపు బోర్డు కోసం కోట్లాడాను అన్నారు. దీని కోసం 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాసి కేంద్రంపై ఒత్తిడి పెంచామని పేర్కొన్నారు. ఇప్పుడు, ప్రోటోకాల్ పాటించకుండా బోర్డు ప్రకటించారని ఆరోపించారు. పసుపు బోర్డు రావడంతో సంపూర్ణం కాదన్నారు.