నా పోరాటం న్యాయం కోసం
NEWS Jan 19,2025 01:41 am
తండ్రీ కొడుకుల మధ్య మరోసారి వార్ మొదలైంది. మోహన్ బాబు, మంచు విష్ణులపై షాకింగ్ కామెంట్స్ చేశారు మంచు మనోజ్. తన పోరాటం వారిద్దరి మీద కాదన్నారు. న్యాయం కోసం తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. తమ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. వాళ్ల తరపున తాను న్యాయం కావాలని కోరుతున్నానని అన్నారు. నాన్నను అడ్డం పెట్టుకుని తన అన్న నాటకం ఆడుతున్నాడని ఆరోపించారు.