ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా
NEWS Jan 18,2025 10:06 am
బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ను ఎంపిక చేసింది. జైస్వాల్, గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటెల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్షదీప్ కి చోటు కల్పించింది. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డికి నిరాశ ఎదురైంది. గాయం నుండి కోలుకోవడంతో స్పీడ్ స్టర్ కు ఛాన్స్ దక్కింది.