త్యాగాల ఫలితం ఉక్కు కర్మాగారం
NEWS Jan 18,2025 08:10 am
ఎందరో చేసిన త్యాగాల ఫలితమే నేటి విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. ఆర్థిక ప్యాకేజీ కింద కేంద్రం రూ. 11 వేల 440 కోట్లు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పీఎం మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కావాలని కర్మాగారాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీ వల్ల పునర్ వైభవం వస్తుందన్నారు.