సైఫ్ కేసులో అండర్ వరల్డ్ పై ఆరా
NEWS Jan 18,2025 07:51 am
దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసుకు సంబంధించి మరాఠా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఘటన వెనుక అండర్ వరల్డ్ ప్రమేయం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మంత్రి యోగేశ్. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, పోలీసులు విచారణ ప్రారంభించారని, నిందితుల కోసం 10 బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు.