జాతీయ స్థాయికి ఎదగాలి
NEWS Jan 18,2025 08:13 am
రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీల్లో రాణించి, జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని జిల్లా అర్చరీ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కామినేని అనిల్‌కుమార్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు తిరుమలగౌడ్ క్రీడాకారులకు సూచించారు. దోమకొండ గడికోటలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాస్థాయి జూనియర్ అర్చరీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. అర్చరీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మోహన్‌రెడ్డి, సలహాదారు రాంచంద్రం, కోచ్ ప్రతాప్ దాస్, పాల్గొన్నారు