సంక్రాంతి తర్వాత మూడు అమలు
NEWS Jan 18,2025 08:14 am
సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జారీ ప్రారంభం కానుంది. గూడు లేని నిరుపేదలకు ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయనున్నారు. ఇప్పటికే సర్వే పూర్తి కాగా, అర్హులను ప్రకటించాల్సి ఉంది. ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా పరిధిలో గిరిజన ప్రాంతాలతో సహా గ్రామ, పట్టణాల్లో నిర్వహించే సభల్లోనే అర్హులను ఎంపిక చేయనున్నారు.