చాగంటిని అవమానించ లేదు
NEWS Jan 18,2025 06:03 am
బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వర్ రావుకు తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో అవమానం జరిగిందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు టీటీడీ ఈవో శ్యామల రావు. చాగంటికి కేబినెట్ హోదా ఉండడంతో ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం దర్శనానికి ఏర్పాట్లు చేసిందన్నారు. తానే వద్దని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళతానంటూ చెప్పారన్నారు. ఇవేవీ తెలుసుకోకుండా టీటీడీపై బురద చల్లితే ఎలా అని ప్రశ్నించారు.