అమిత్ షాను ఆంధ్రాలో అడుగు పెట్టనీయం
NEWS Jan 18,2025 04:10 am
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన షాను ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనీయమని హెచ్చరించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. అదానీ, అంబానీలకు ఊడిగం చేస్తున్న కేంద్రానికి అంత సీన్ లేదన్నారు.