Logo
Download our app
సీఎం రేవంత్‌ ముందు రూ.2500 ఇవ్వు.. బోథ్‌లో మహిళల వినూత్న నిరసన
NEWS   Jan 18,2025 05:12 am
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ముందు మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్న రూ.2500 ఇవ్వాలంటూ మహిళలు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏ పండుగనూ సంతోషంగా జరుపుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయాలంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపారు. 4 వేల పింఛన్‌, ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి, తులం బంగారం, రూ.15 వేల రైతుబంధు, రైతు కులీలకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source