ఇందిరమ్మ సర్వే మరింత వేగం
NEWS Jan 18,2025 05:58 am
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా జరుగుతున్న సర్వే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా పూర్తి కాకపోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క రంగంలోకి దిగారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారుల జాబితా ప్రకటించాల్సి ఉండగా ఉమ్మడి జిల్లాలో సుమారు 10 శాతం పైగా సర్వే పూర్తి కాలేదని ప్రభుత్వానికి నివేదిక అందినట్లు సమాచారం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో సర్వే పూర్తి కాకపోవడం ఇబ్బందిగా మారుతున్నది.