Logo
Download our app
నాగోబా జాతరకు వేళాయె
NEWS   Jan 18,2025 02:40 am
అత్యంత ప్రసిద్ధ గిరిజన ధార్మిక కార్యక్రమాలలో ఒకటి కేస్లాపూర్ నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది. అమావాస్య అర్ధరాత్రి వేళ చిమ్మ చీకట్లో గిరిజనులంతా కలిసి వెలుగు కోసం అన్వేషిస్తారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాది జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం కానుంది. జనవరి 10వ తేదీన మెస్రం వంశీయులు పాదరక్షలు విడిచి గంగాజల్ యాత్రను ప్రారంభించారు.
⚠️ You are not allowed to copy content or view source