Logo
Download our app
రేషన్ కార్డుల సర్వేను పరిశీలించిన చైర్మన్
NEWS   Jan 19,2025 06:24 pm
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ కార్డుల సర్వే శుక్రవారం మున్సిపల్ అధికారులు బెల్లంపల్లి పట్టణం 6వ వార్డు ఇంక్లైన్ బస్తిలో చేపట్టారు. రేషన్ కార్డు సర్వేను మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్, ఐదో వార్డ్ కౌన్సిలర్ విజయ తిరుమల, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జావిద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస లతో కలిసి పరిశీలించారు. రేషన్ కార్డు ల సర్వే పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, వార్డ్ ఆఫీసర్ సుష్మ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source