Logo
Download our app
విశాఖ‌కు సాయం మోడీకి రుణ‌ప‌డి ఉన్నాం
NEWS   Jan 17,2025 12:35 pm
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్లు ప్యాకేజీ ఇవ్వ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు. స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీకి రుణ‌ప‌డి ఉన్నామ‌న్నారు. ప్లాంట్‌ నిలబెడతామన్న కూటమి మాటకు ఇవాళ ప్యాకేజీ కేటాయించడం జ‌రిగింద‌న్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పునరుజ్జీవనానికి ఉక్కుమంత్రి కుమారస్వామి సహకరించారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఎంతో సంతోషం క‌లిగించింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source