కేటీఆర్ కు పిచ్చి పట్టింది
NEWS Jan 17,2025 12:09 pm
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కు పిచ్చి పట్టిందని, ఆయనను త్వరలోనే మెంటల్ ఆస్పత్రిలో చేర్చాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సోయి లేకుండా ఇంకోసారి నోరు జారితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎంపీ. రైతు రుణ మాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కనిపించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.