విశాఖ ఉక్కుకు రూ. 11,440 కోట్ల ప్యాకేజీ
NEWS Jan 17,2025 12:00 pm
కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఏపీలోని విశాఖ ఉక్కు కార్మాగారానికి ఉద్దీపన కలిగించేలా తీపి కబురు చెప్పింది. కంపెనీకి రూ. 11,440 కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఆనాటి దివంగత ప్రధాని వాజపేయ్ రూ. 1600 కోట్ల రుణాలను మాఫీ చేశారు. గత ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించక పోగా తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలించింది. ఈ సందర్బంగా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి వంగలపూడి అనిత.