సైఫ్ అలీ ఖాన్ సేఫ్
NEWS Jan 17,2025 10:42 am
కత్తిపోట్లకు గురై ముంబై లోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. పదునైన ఆయుధంతో సైఫ్ వెన్నెముకను డ్యామేజ్ చేశాడని, అయినా డ్యామేజ్ కాలేదన్నారు. సైఫ్ ను ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్ కు మారుస్తున్నామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు.