తెలంగాణ తల్లి ముంగిట్లో విద్యుత్ కాంతులు
NEWS Jan 17,2025 10:36 am
రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహం రూపు రేఖలను మార్చింది. విగ్రహాన్ని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసింది. భారీ ఎత్తున దీనికోసం ఖర్చు చేసింది. తెలంగాణ తల్లి విగ్రహానికి మరింత మెరుగులు దిద్దారు. మరో వైపు మరింత ఆకర్షణీయంగా ఉండేలా విద్యుత్ కాంతులు వెదజల్లేలా ఏర్పాటు చేశారు. రంగు రంగుల పూలను కూడా ఉంచారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఆర్ అండ్ బి కార్యదర్శి దాసరి హరి చందన పరిశీలించారు.