బాబూ హామీల అమలుపై మౌనమేల..?
NEWS Jan 17,2025 05:37 am
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయక పోవడం దారుణమన్నారు. ఇచ్చే ముందు ఆలోచించ లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.