బిడ్డ డిస్టింక్షన్ గర్వంగా ఉందన్న జగన్
NEWS Jan 17,2025 03:41 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తన కూతురు వర్షా రెడ్డి లండన్ లోని ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిందని, అంతే కాకుండా డిస్టింక్షన్ లో పాస్ కావడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఎక్స్ వేదికగా స్పందించారు జగన్ . తాతకు తగ్గ తనయురాలు అని అనిపించుకుందంటూ పేర్కొన్నారు. మమ్మల్ని గర్వ పడేలా చేసిందని అన్నారు.