ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ పిటిషన్
NEWS Jan 17,2025 03:32 am
పార్టీ మారిన ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పొచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, కడియం శ్రీహరి, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ లపై వెంటనే స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరింది.