మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ
NEWS Jan 17,2025 03:27 am
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన. లక్షన్నర నగదుతో పాటు భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకు పోయారంటూ పొన్నాల భార్య అరుణాదేవి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఎంత మొత్తం చోరీ అయిందనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఖాకీలు.