మహిళలు ఇక పారాహుషార్
NEWS Jan 17,2025 03:15 am
ఏపీ టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే రాష్ట్రంలోని మహిళలు, ఆడబిడ్డలు, యువతులు, బాలికలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ఉచిత ప్రయాణం ద్వారా లక్షలాది మంది మహిళల సాధికారతకు మార్గం ఏర్పడుతుందన్నారు. గుర్తింపు కార్డుంటే చాలు ఎక్కడికైనా జర్నీ చేయొచ్చన్నారు.