పల్లెల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు
NEWS Jan 17,2025 03:11 am
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. పట్టణాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను ఇక నుంచి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లక్షలాది మందికి ప్రతి నిత్యం తక్కువ ధరతో నాణ్యమైన భోజనం, టిఫిన్లు అన్న క్యాంటీన్ల ద్వారా అందజేస్తోంది. ఇస్కాన్ తో కలిసి సర్కార్ ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. దివంగత ఉమ్మడి ఏపీ సీఎం నందమూరి తారక రామారావు స్మారకార్థం వీటిని ప్రారంభించింది టీడీపీ.