నామినేటెడ్ పదవులపై సీఎం ఫోకస్
NEWS Jan 17,2025 03:07 am
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మిగిలి పోయిన నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఖుష్ కబర్ చెప్పారు.. దీంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక తెలుగుదేశం పార్టీ రికార్డు సృష్టించింది. సభ్యత్వ నమోదులో ఏకంగా కోటి దాటింది. ఈ సందర్బంగా కష్టపడిన ప్రతి ఒక్కరినీ అభినందించారు సీఎం. ఎంపీలు, జోనల్ ఇంఛార్జ్ లు ఆయా శాఖలపై దృష్టి సారించాలని ఆదేశించారు.