వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
NEWS Jan 17,2025 03:01 am
వైకుంఠ ద్వార దర్శనం ఎస్‌ఎస్‌డి టోకెన్లపై టిటిడి ఈవో జె.శ్యామలరావు సమీక్షించారు. ఈనెల 19న ముగస్తుందన్నారు. 20న దర్శనం కోసం వచ్చే భక్తులకు 19న ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయడం లేదని స్పష్టం చేశారు. వారు సర్వ దర్శనం కోసం క్యూ లైన్ లో మాత్రమే శ్రీవారిని దర్శించు కోవాల్సి ఉంటుందన్నారు. టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశామన్నారు ఈవో. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమన్నారు.