అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు
NEWS Jan 17,2025 03:01 am
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లాల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చోరీ చేసిన సొత్తును రికవరీ చేసినట్లు కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనిలోని ఐదు గుళ్లలో జరిగిన దొంగతనంపై ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ముగ్గురు అనుమానితుల్ని పట్టుకుని విచారించారు. కామారెడ్డిలో 5, దేవునిపల్లి పరిధిలో 3, బిక్కనూర్, రామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి