పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్
NEWS Jan 16,2025 05:46 pm
పలు వార్డులలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు మున్సిపల్ కమిషనర్ టి మోహన్. మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి మరుసటి రోజు ట్రాక్టర్ ద్వారా లిఫ్ట్ చేయించాలని, ప్రజలు తడి చెత్త పొడి చెత్తను మున్సిపల్ ఆటోలకు అంది ఇవ్వాలని, మురికి కాల్వలో గాని, రోడ్డుపై గాని పోసి అపరిశుభ్రం చేయవద్దని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్య పనులు మెరుగుపరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకటలక్ష్మి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, విష్ణు, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.