కేంద్ర మంత్రితో సీఎం భేటీ
NEWS Jan 16,2025 11:41 am
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. తాజాగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను కలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను క్లియర్ చేయాలని సీఎం భూపేందర్ ను కోరారు.