మోహన్ భగవత్ పై చింతా మోహన్ ఫైర్
NEWS Jan 16,2025 11:19 am
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదన్నారు. ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు నిషేధిత సంస్థ అని తెలుసుకుంటే మంచిదన్నారు. రామాలయం కట్టిన తర్వాతనే దేశానికి స్వేచ్ఛ లభించిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ఎందుకు మోడీ స్పందించ లేదంటూ ఫైర్ అయ్యారు చింతా మోహన్.