Logo
Download our app
కేటీఆర్ నీకు జైలే గ‌తి
NEWS   Jan 16,2025 11:07 am
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేపుతోంది. ఇక నీకు జైలే గ‌తి అంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హ‌యాంలో త‌న‌ను అక్ర‌మంగా జైల్లో పెట్టార‌ని ఆరోపించారు. ఇప్పుడు కూడా నీకు అదే గ‌తి ప‌ట్ట‌క త‌ప్ప‌ద‌న్నారు. జైలుకు వెళ్లే ముందు 4 జ‌త‌ల బ‌ట్ట‌లు, దుప్ప‌టి, ట‌వ‌ల్, కర్చీఫ్, స‌బ్బులు, చట్నీలు తీసుకు వెళ్లండి అంటూ సెటైర్ వేశారు. అయితే స్వెట‌ర్ తీసుకెళ్ల‌డం మ‌రిచి పోవ‌ద్దంటూ హిత‌వు ప‌లికారు.
⚠️ You are not allowed to copy content or view source