Logo
Download our app
మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల‌పై కేసు
NEWS   Jan 16,2025 10:34 am
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కేసు నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని భ్రమరాంబ ఆలయం వద్ద పోలీసు విధులకు ఆటంకం కలిగించాడంటూ ఎస్ఐ ర‌మేష్ ఫిర్యాదు చేశారు. గువ్వ‌ల‌తో పాటు బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై కూడా కేసు న‌మోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గుడిలో ఉన్నాడ‌ని , అందుకే త‌న‌ను అనుమతించ లేదు. ఎమ్మెల్యే ఒత్తిళ్ల మేర‌కే త‌న‌పై కేసు న‌మోదు చేశార‌ని ఆరోపించారు గువ్వ‌ల .
⚠️ You are not allowed to copy content or view source