లింగంపేట్ లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు
NEWS Jan 16,2025 10:29 am
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం లింగం పేట్ మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం నిర్వహించారు. తొలుత మెగా రక్త దాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు భడతలపై సమాజంలో ప్రతీ ఒక్కరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలని సూచించారు