ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేశారు
NEWS Jan 16,2025 09:43 am
తెలంగాణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారంటూ ఆరోపించారు. ఒక బీసీ మహిళగా, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బిడ్డగా తాను నామినేటెడ్ పదవికి అన్ని రకాలుగా అర్హులేనని పేర్కొన్నారు. తనపై 150కి పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్ల వద్ద ధర్నా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.