సైఫ్ దాడి ఘటనలో నిందితుడి గుర్తింపు
NEWS Jan 16,2025 09:23 am
సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో కీలక అప్ డేట్ వచ్చింది. ఈ మేరకు ఘటనకు సంబంధించి ముంబై పోలీస్ జోన్ - 9 డీసీపీ దీక్షిత్ గెడెమ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. విచారణ చేపట్టామని, మొత్తం 10 బృందాలను నియమించడం జరిగిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించామని, ఇద్దరు పాల్గొన్నట్లు గుర్తించామన్నారు. ఒకరిని ఐడెంటిఫై చేశామన్నారు.