వేప చెట్టులో పాలు.. తండోప తండాలుగా జనాలు
NEWS Jan 16,2025 08:43 am
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మణురు పంచాయతీ సుంకరెడ్డిపల్లి గ్రామంలో సదానందరెడ్డి అనే ఒక రైతు పొలంలో ఒక పెద్ద వేప చెట్టు నుండి ధారలుగా పాలు కారుతూ ఉన్నాయి. ఈ దృశ్యాన్ని చూడటానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు వచ్చి దైవానుగ్రహంగా భావించి వేప చెట్టుకు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తున్నారు.