సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం పదిలం
NEWS Jan 16,2025 08:23 am
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురై ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు సైఫ్ భార్య, ప్రముఖ నటి కరీనా కపూర్. కీలక ప్రకటన చేశారు. అభిమానుల ప్రార్థనలతో తన భర్త బతికి బయట పడ్డాడని, క్షేమంగా ఉన్నారని తెలిపారు. చోరీ చేసేందుకు వచ్చిన ఆగంతకుడు ఈ దాడికి పాల్పడ్డాడని అన్నారు.