పోలీస్ అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
NEWS Jan 16,2025 10:30 am
జగిత్యాల జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ అథ్లెటిక్స్ పోటీలను ఘనంగా ప్రారంభించారు జిల్లా ఎస్పీ అశోక్ కుమారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ లలో సిబ్బందికి ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖకు క్రీడలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్ పల్లి డీఎస్పీ రాములు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.