ఎస్సారెస్పీ నుంచి యాసంగికి సాగు నీరు
NEWS Jan 16,2025 08:43 am
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటలకు కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం వేగంగా తగ్గుతుంది.ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుత సంవత్సరం యాసంగి సీజన్‌కు గత నెల 25న అధికారులు నీటి విడుదల చేశారు. అప్పుడు ప్రాజెక్ట్‌లో 80.5 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 60.65 టీఎంసీలకు పడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 టీఎంసీల నీటిని వదిలారు. ప్రతి రోజు సగటున టీఎంసీ నీరు తగ్గేలా ప్రాజెక్ట్ అధికారులు నీటి విడుదలను చేపడుతున్నారు.