ఆర్మూర్ ఎమ్మెల్యేపై కావాలనే వాల్ పోస్టర్లు
NEWS Jan 16,2025 09:43 am
ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ఎమ్మెల్యేను రావద్దంటూ బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో దొంగచాటున వాల్‌పోస్టర్లు అంటించారని బీజేపీ నాయకులు విమర్శించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత, స్వచ్చభారత్ జిల్లా చైర్మన్ ఆదిమూలం వీరేశం డిమాండ్ చేశారు. దొంగచాటున వాల్‌పోస్టర్లు అంటించిన జోర్పూర్ రాము గతంలో ఇసపల్లి వద్ద ఎంపీ అర్వింద్ కాన్వయ్‌పై దాడి చేసి మారణాయుదాలతో హంగామా చేసిన ఘటన అందరికి తెలుసన్నారు.