శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.42 కోట్లు
NEWS Jan 16,2025 02:19 am
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల గిరులు భక్తుల గోవింద నామ స్మరణతో మారు మ్రోగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ శ్రీకారం చుట్టడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను రికార్డ్ స్థాయిలో 71 వేల 417 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 396 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.42 కోట్లు వచ్చినట్లు ఈవో తెలిపారు.