తెలంగాణ హైకోర్టుకు నలుగురు జడ్జీలు
NEWS Jan 16,2025 02:06 am
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఏపీ హైకోర్టుకు ఇద్దరి పేర్లను కేంద్ర సర్కార్ కు ప్రతిపాదించింది. తెలంగాణ హైకోర్టుకు వై.రేణుక, నందికొండ నర్సింగరావు, తిరుమల దేవి, మధుసూదన్ రావు ను నియమించింది. జ్యుడీషియల్ ఆఫీసర్ల కోటాలో నలుగురు పేర్లను ప్రతిపాదించింది.