Logo
Download our app
హైకోర్టు జ‌డ్జీలుగా సుప్రీంకోర్టు సిఫార్సు
NEWS   Jan 16,2025 02:03 am
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఏపీ హైకోర్టుకు ఇద్దరి పేర్లను కేంద్ర స‌ర్కార్ కు ప్ర‌తిపాదించింది. తెలంగాణ హైకోర్టుకు వై.రేణుక, నందికొండ నర్సింగరావు, తిరుమల దేవి, మధుసూదన్‌ రావు; ఏపీ హైకోర్టుకు హరిహరనాథ శర్మ, యడవల్లి లక్ష్మణరావు పేర్లు సిఫార్సు చేసింది. జ్యుడీషియల్‌ ఆఫీసర్ల కోటాలో ఈ ఆరుగురు పేర్లను ప్ర‌తిపాదించింది.
⚠️ You are not allowed to copy content or view source