జోగన్ పల్లి ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ విజేత గౌడ్స్ యూత్ టీం
NEWS Jan 16,2025 04:17 am
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోరుట్ల పట్టణ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రాల హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా గౌడ్స్ నిలిచింది. టోర్నమెంట్ లో మొత్తం గ్రామం నుండి ఐదు టీంలో బరిలో దిగగా ఫైనల్ మ్యాచ్ లో అంబేద్కర్ యూత్ టీం పైన గౌడ్స్ యూత్ టీం గెలిచి విజేతగా నిలువగా, రన్నర్ అప్ గా అంబేద్కర్ యూత్ టీం గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు.